ఆర్థిక నేరగాడు సుఖేశ్ బుగ్గపై జాక్వలిన్ ముద్దు.. బయటకొచ్చిన మిర్రర్ సెల్ఫీ!
on Nov 30, 2021
రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సాక్షిగా బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడనే అభియోగంపై విచారణ ఎదుర్కొంటున్న సుఖేశ్ చంద్రశేఖర్ కొద్ది కాలం జాక్వలిన్‌తో డేటింగ్‌లో ఉన్నాడని రిపోర్టులు తెలుపుతున్నాయి. గత వారం జాక్వలిన్, సుఖేశ్‌కు చెందిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. అందులో మిర్రర్ సెల్ఫీలో జాక్వలిన్ బుగ్గపై సుఖేశ్ ముద్దు పెడుతున్నాడు.
లేటెస్ట్‌గా సుఖేశ్ బుగ్గపై జాక్వలిన్ ప్రేమగా ముద్దుపెడుతున్న ఫొటో బయటకు వచ్చింది. అందులో సుఖేశ్‌ను గట్టిగా హత్తుకొని ముద్దు పెడుతోంది జాక్వలిన్. ఈ పిక్చర్ కూడా సుఖేశ్ మిర్రర్ సెల్ఫీ తీస్తున్నప్పటిదే. బయటకు వచ్చిన క్షణాల వ్యవధిలో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also read: ఆర్థిక నేరగాడు సుఖేశ్‌తో రిలేషన్‌షిప్‌లో జాక్వలిన్? ఫొటో వైరల్!
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు చెప్తున్నదాని ప్రకారం జాక్వలిన్‌ను చెన్నైలో సుఖేశ్ నాలుగుసార్లు కలిశాడు, ఆమె కోసం అతను ప్రైవేట్ జెట్‌ను కూడా ఏర్పాటుచేశాడు. గత నెలలో సుఖేశ్, నటి అయిన అతని భార్య లీనా మరియా పాల్ కలిసి చేసిన రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి జాక్వలిన్‌ను ఈడీ ఏడు గంటల పాటు విచారించింది. సుఖేశ్‌తో జాక్వలిన్‌కు రిలేషన్ షిప్ ఉందని అతని లాయర్ అనంత్ మాలిక్ ఇదివరకు వెల్లడించాడు. అయితే దీన్ని జాక్వలిన్ అధికార ప్రతినిధి ఖండించారు.
Also Read